కొంతమందికి నేటికీ అందని వరద సహాయం...

Published: Tuesday September 20, 2022
జూలై నెలలో గోదావరి వరదల వల్ల అతలాకుతలమైన బూర్గంపాడు., అశ్వాపురం  మండలం లోని ముంపు వాసులకు ప్రభుత్వ గోదావరి సహాయం నేటికీ అందలేదని  ప్రజలు ఆవేదన వెలిబుచ్చుతన్నారు .   గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం పదివేల సహాయాన్ని ప్రకటించిం దని ,  అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ గోదావరి ప్రభుత్వ సహాయం కోసం తిరుగుతున్న సహాయం అందక పోవడం శోచనీయమన్నారు. . మండలంలోని  నెల్లిపాక బంజర, టేకులు గుట్ట  ఇల్లు పై నుండి గోదావరి వరద ప్రవాహం ప్రవహించిందని వారు ఆవేదన వెలిబుచ్చారు . ఈ ప్రాంతంలోని గోదా వరి ముంపు వాసులకు కొంతమందికి నేటికీ రూ 10 వేల రూపాయల ప్రభుత్వ సహాయం అందలేదు.. ఈ .గోదావరి వరద ముంపు బాధితులకు ప్రభుత్వ సహాయం 10,000 అందేలా చూడాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
అంతేకాకుండా 1986 తర్వాత అంత పెద్ద వరద 1990 మరియు ఈ సంవత్సరమే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మా బతుకుల పరిస్థితి ఏమిటి అని ప్రజలు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం వారు స్పందించి మా ప్రాంతం వారికి తగిన సహాయ సహకారాలు అందించి మమ్మల్ని పోలవరం ముంపు ప్రాంతాలు గా ప్రకటించాలని  ప్రజలు కోరుకుంటున్నారు.. పోలవరం ప్యాకేజీ కూడా ప్రకటించాలని  ప్రజలు కోరుకుంటున్నారు.