వీఆర్ఏల దీక్షపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలి వంటావార్పు కార్యక్రమంలో నిరసన వ్యక్త

Published: Wednesday August 03, 2022

బోనకల్, ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె మంగళవారంతో 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విఆర్ఏలు వంట వార్పు చేపట్టి నిరసన తెలిపారు. వంటావార్పుకు స్థానిక తాసిల్దార్ రావూరి రాధిక,కార్యాలయ సిబ్బంది సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ మా నాయ్యం మైన డిమాండ్లను పరిశీలించేందుకు, ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 55 సంవత్సరాలు నిండిన వి ఆర్ ఏల స్థానంలో వారసులకు విఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసారు. మరణించిన వి ఆర్ ఏల స్థానంలో కారుణ్య నియామకం చేపట్టాలని, తమకు పే స్కెల్ ఇవ్వాలని కోరారు. విఆర్ఏల పే స్కేల్ జి ఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన విఆర్ ఏ లకు పదోన్నతులు కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 9 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టిన తమ దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, ఆర్ఐ గుగులోత్ లక్ష్మణ్, యూ డి సి నాగలక్ష్మి, వీఆర్ఏ మండల అధ్యక్షులు ఎం సుధాకర్, కార్యదర్శి కిరణ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకట్, జిల్లా కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు రంజిత, జానకి, కోటేశ్వరి, నాగేంద్ర, నాగలక్ష్మి, లాజర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.