క్రీడా ప్రాంగణాల పనులను త్వరగా పూర్తి చేయాలి

Published: Thursday November 24, 2022
 జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజా పాలన : పెండింగ్ లో ఉన్న క్రీడా ప్రాంగణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ ) రాహుల్ శర్మ ఐఏఎస్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్.డి.ఓ కృష్ణన్ తో కలిసి అదనపు కలెక్టర్ పూడూరు మండలం లోని మిర్జాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం, తడి పొడి చెత్తను వేరు చేసే కేంద్రమును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, అంగన్వాడీ కేంద్రమును సందర్శించి  మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మంచి పౌష్టిక ఆహారమును అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మన్నెగూడ గ్రామం యొక్క నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనంను సందర్శించి కలుపు మొక్కలను తొలగించాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మీర్జాపూర్ క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. అదనపు కలెక్టర్ పర్యటనలు పూడూర్ మండలం ఎంపీడీఓ ఉమాదేవి, డిఎల్పీఓ అనిత, ఎంపిఓ సుందర్, ఎపిఓ రాములు, ఈసీ అశోక్, ఆయా గ్రామ సర్పంచులు టీఏలు పాల్గొన్నారు.