భారతీయ బెరోజ్గార్ మోర్చా పిలుపుమేరకు లంబాడి హక్కుల పోరాట సమితి

Published: Thursday May 13, 2021
పరిగి, 12 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గంలో భారతీయ బెరోజ్గార్ మోర్చా పిలుపుమేరకు స్థానిక కార్యాలయంలో భారతీయ విద్యార్థి మోర్చా, భారతీయ యువ మోర్చా, లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం, బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో 21వ శతాబ్దం ఆధునిక మనుధర్మ శాస్త్రం అయినా  ఈవీఎం ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ను దహనం చేయడం జరిగింది. దేశంలో పూర్వం మను ధర్మ శాస్త్రం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల అయినా ఈ దేశ మూలనివాసులకు బానిసలను చేసింది అప్పటి మనుధర్మ శాస్త్రం ఇప్పుడు ఈవీఎం రూపంలో ఈ దేశ మూలనివాసుల హక్కులను కాలరాస్తుంది. విశ్వ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట ఫలితం వల్ల వచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఆధునిక మనుధర్మ శాస్త్రం అయినా ఈవిఎం మిషన్ ఓటు హక్కును జీరో చేస్తుంది. ఈ దేశంలో లో అన్ని సమస్యలకు ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ 8 అక్టోబర్ 2013 నాడు సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ద్వారా పారదర్శకమైన ఎన్నికలు జరగవని తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకుండా ఎన్నికల కమిషన్ 2014లో ఓట్లను దొంగిలిస్తున్న ఈ మిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించి బిజెపి పార్టీకి అధికారంలోకి రావడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించింది. కావున నిరుద్యోగము విద్య వైద్యం ప్రైవేటీకరణ కు కారణం ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ఢిల్లీలో సుమారు ఐదు నెలల పాటు రైతులు ఉద్యమాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా అనిపించలేదు ఎందుకంటే ప్రభుత్వాలకు ప్రజల ఓటుతో పని లేదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా అధికారంలోకి వస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధీమా ఉంది. అందుకే దేశంలో ఇలాంటి సమస్యకు పరిష్కారం కావడం లేదు అందుకని భారతీయ బేరోజ్గార్ మోర్చా పిలుపుమేరకు బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఈవిఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్ ను దహనం చేయడం జరిగిందని విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు గట్యా నాయక్, (లంబాడి హక్కుల పోరాట సమితి) బహుజన్ క్రాంతి మోర్చా జిల్లా కన్వీనర్ గోవింద్ నాయక్, (గిరిజన విద్యార్థి సంఘం) భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఠాకూర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...