కారు డ్రైవర్ లకు కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలి

Published: Saturday June 04, 2022

సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి*

కరీంనగర్‌ జూన్ 3 ప్రజాపాలన ప్రతినిధి :
ఈరోజు భారత్ టాకీస్ జెండా చౌరస్తా వద్ద కారు డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ  తిరుమల్  గారు ఎస్ ఐ ప్రవీణ్ రాజ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్  హాజరయ్యారు ట్రాఫిక్ సీఐ తిరుమల్ గారు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి అని ఫోన్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్ చేయవద్దు అని ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కోరారు తప్పనిసరి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి తెలియజేశారు,. కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేపట్టారు
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి  పున్నం రవి మాట్లాడుతూ... ప్రతి  సంవత్సరం జూన్ 3 న, కారు డ్రైవర్ల దినోత్సవం జరుపుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు  సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని   తెలిపారు. అట్లాగే ప్రభుత్వం కారు డ్రైవర్లను గుర్తించాలని ,వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి కారు డ్రైవర్ కు 3 వేలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు కారు యజమానులు ప్రజా ప్రతినిధులు,  ప్రభుత్వ అధికారులు,  గ్రానైట్ వ్యాపారులు, డాక్టర్లు వద్ద పనిచేసే కారు డ్రైవర్లు కు సీనియారిటీ ప్రకారం కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని పిఎఫ్ ,బోనస్ ,చెల్లించాలని, టెంపర్ వరి డ్రైవర్ లకు రోజుకు లోకల్ 8 వందలు ఇతర ప్రాంతాలకు దూరాన్ని బట్టి వెయ్యి నుంచి 12 వందలు ఇవ్వాలని కోరారు. కరోనా వైరస్ వల్ల రెండు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామని   చాలామంది కారు యజమానులు కారు డ్రైవర్ల ను  తొలగించారని తెలిపారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరల కు అనుగుణంగా  మా యొక్క జీతాలు పెంచాలని  కోరారు. పెంచే విధంగా డి సి ఎల్  గారు చొరవ తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ,పోతుగంటి శ్రీనివాస్, చెలికాని శ్రీనివాస్, సతీష్ రాజు ,సదానందం, హరి స్వామి, మహేష్, యండి హాజర్ , పున్నం రాజు,అనిల్.వినోద్.రాము.
తదితరులు పాల్గొన్నారు