సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Published: Wednesday January 12, 2022

చెరుపల్లి సీతారాములు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు
ఇబ్రహీంపట్నం జనవరి తేది 11 ప్రజాపాలన ప్రతినిధి : కార్మిక, కర్షక, పేదల పక్షపాతి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు ఈ నెల 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపల్ కేంద్రంలోని మాసాబ్ చెరువు కట్టక్రింద ఉన్న సామ శ్రీనివాస్ రెడ్డి (SSR  గార్డెన్స్ లో జరగనున్న నేపథ్యంలో మంగళవారం రోజు సిపిఎం శ్రేణులు స్థానిక రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్ లో సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు  మాట్లాడుతూ సిపిఎం పార్టీ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకోసారి జరుగుతాయని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ 3వ మహాసభలను రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ప్రాంతంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీనియర్ పొలిట్ భ్యూరో సభ్యులు ప్రకాష్ కరాత్, బి.వి రాఘవులుతో పాటు రాష్ట్రం మరియు వివిధ జిల్లాల్లోని సిపిఎం అగ్రనేతలందరూ హాజరవుతున్నారని అన్నారు కార్మిక, రైతాంగ మరియు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఈ మహాసభల్లో చర్చించి ప్రజా ఉద్యమాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంతో పాటు పార్టీ నిర్మాణం, ప్రజాపునాధిని విస్తరించేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్చించనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి.మధుసూదన్ రెడ్డి, బి.సామెల్, సి.శోభన్, జి.కవిత, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, ఇ.నర్సింహా, ఏ. నర్సింహా, కె.జగన్, పి.అంజయ్య, నర్సిరెడ్డి, ఆర్.జంగయ్య, ఏ.భాస్కరెడ్డి, బి.శంకరయ్య, సీహెచ్. ఎల్లేశ్, రజాక్ పాషా, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.