చెరుకు దిగుబడులు ఎలా ఉన్నాయి... రైతులు పోటీలు పడి సాగు చేయాలి. నామ..

Published: Monday December 05, 2022
పాలేరు డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి
నాకు నష్టం వచ్చినా....రైతుల కోసమే ఫ్యాక్టరీ నడుపుతా...
 
చెరుకు రైతులతో మధుకాన్ చైర్మన్,
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా తొలుత రాజేశ్వరపురం కోఆపరేటివ్ గోడం
నిర్మాణా శంఖుస్థాపన లో పాల్గొన్నారు. గ్రామంలోని నూతన
 
వధువరులను ఆశ్వీరదించారు. అనంతరం గ్రామంలో చెరుకు తోటలను
 
స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. రైతులను దిగుబడులు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడులు, దిగుబడులు, పలు,
పర్యటన నిర్వహించారు. తొలుత రాజేశ్వరపురం లోని సోసైటీ గోడౌన్ రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే ఈ సీజన్ లో 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కోన్నారు. కనుక రైతులు పోటీలు పడి చెరుకు సాగు చేయాలని
సూచించారు. మధుకాన్ సంస్థ(నాకు) నష్టం వచ్చినా ఫర్వాలేదు కాని
రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి అదే నా లక్ష్యం. రైతుల కోసం ఎంత కష్టమైనా ఫ్యాక్టరీ ని నడిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు సంతోషం ను వ్యక్తం చేశారు. ఆయన వెంట సీడీసీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
వీరవెల్లి నాగరాజు, చెరుకు రైతు ప్రతినిధులు వజ్జా శ్రీనివాసరావు.
మంకెన వెంకటేశ్వరరావు, దండా రంగయ్య, జటంగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు