అర్హులైన జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Published: Wednesday May 25, 2022
 జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ భారతి హోళికేరి
 
మంచిర్యాల బ్యూరో, మే 24, ప్రజాపాలన: 
 
జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు కొరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. 2022-24 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, 2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీకి అర్హులైన జర్నలిస్టులు ఈ ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు సమాచారశాఖ ఆన్లైన్ వెబ్సైట్ https:/ipr.telangana.gov.inను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ను క్లిక్ చేసి జర్నలిస్ట్లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు. చేయాలని, అట్టి ప్రతులను జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ జీ.ఓ. నం.239 ప్రకారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం మేరకు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.