ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి *జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు బస్సు సౌకర్యం కల్

Published: Wednesday October 26, 2022


రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇటీవల కొంగర కలాన్ గ్రామం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొత్త కార్యాలయాన్ని నిర్మించి ప్రారంభించడం సంతోషకరమని అన్నారు.  గతంలో  నగరంలోని లకిడికాపూల్ లో ఉన్న కలెక్టర్ కార్యాలయం దూరంగా వుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోవదానికి దూరం అయ్యేదని అన్నారు.   అట్టి కార్యాలయం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిర్మించడం అక్కడి నుండే  కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో  ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రాంత ప్రజలకు దగ్గర కావడం సంతోషం కరమని అన్నారు. ఈ ప్రాంత  ప్రజలకు దగ్గరగా అనుకూలంగా ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కలెక్టర్ కార్యాలయం కొంగర గ్రామానికి ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో నడిచిపోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్త ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే బస్సు సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గాని కొంగర గ్రామం నుంచి గానీ వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు లోపలికి పోవాల్సింది ఉంటుంది. ఇబ్రహీంపట్నంలో బస్సు ఎక్కి బొంగులూరు గేటు దగ్గర దిగి మళ్లీ ఔటర్ రింగ్ రోడ్డు నుండి కలెక్టర్ ఆఫీస్ కు పోవాలంటే బస్సు సౌకర్యం గాని ప్రైవేటు వాహన సౌకర్యం గాని లేదు. నూతన కలెక్టర్ కార్యాలయం కంటే  నగరంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి దూరమైన పోవడానికి రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండేదని చెప్పారు. ఈ ప్రాంతం నుండి ఎల్బీనగర్ పోయి  అక్కడి నుండి మెట్రో ట్రైన్ ఎక్కి కలెక్టర్ కార్యాలయానికి సులువుగా పోయే అవకాశం ఉండేది అన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయానికి పోవడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావున ఇబ్రహీంపట్నం ప్రాంతం నుండి కొంగర సమీపంలోని కలెక్టర్ కార్యాలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం నుండి కొంగర సమీపంలోని కలెక్టర్ కార్యాలయం వరకు ప్రతి గంటకు ఒక బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరుతున్నట్లు చెప్పారు.