కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిపై నిర్లక్ష్యం తగదు

Published: Monday October 11, 2021
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ డిమాండ్
కోరుట్ల, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న సామాజిక ఆరోగ్య ఆసుపత్రి అరకొర సౌకర్యాలతో అల్లాడుతున్న పట్టించుకునే నాథడే కరువయ్యారని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకోని కోరుట్ల పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాల ఇబ్బందులకు గురవుతున్నారని వివిధ పత్రికల్లో ప్రచురించిన అధికారులు, పాలకులు స్పందించకపోవడం భాదకరమన్నారు. ఇకనైనా ఆసుపత్రి సౌకర్యాలను వెంటనే మెరుగు పర్చి గర్భిణీలకు మరియు వారికి పుట్టిన పిల్లలకు సంబంధించిన మందులు, పిల్లల వేట్ మిషన్ శుభ్రత లేక మరుగున పడడం, జనరేటర్, రక్త పరిక్షల పరికరాలు, వంద పడకలు మరియు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేట భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.