రాత్రికి రాత్రే సామాన్లు తరలించిన అక్షర చిట్ ఫండ్ సంస్థ

Published: Saturday April 08, 2023
మధిర, ఏప్రిల్ 6 ప్రజాపాలన ప్రతినిధి:అక్షర చిట్ ఫండ్ నందు చిట్టి పూర్తయిన వారికి చెక్కులు జారీ చేసిన సంస్థ కానీ..సంస్థ అకౌంట్లో ఫండ్ లేకా చిట్టి పాట పాడిన వారికి డబ్బులు రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా మధిర అక్షర చిట్ ఫండ్ చిట్టు కట్టిన వారి పరిస్థితి అయోమయం, ఇప్పుడేమో పూర్తిగా బోర్డు తిప్పే పరిస్థితి, ఎంతోమంది చిట్టిఖాతాదారులకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే అన్యాయం జరిగిన బాధితులను కాపాడాలని చిట్ఫండ్ యజమాని పై చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూడాలని బాధితులు వేడుకుంటున్నారు.