కాంగ్రెస్ పార్టీ నాయకులను నానా ఇబ్బందులకు గురి చేస్తే... తెలుగుబాటు తీవ్రమౌతుంది

Published: Wednesday September 15, 2021
బాలాపూర్, సెప్టెంబర్14, ప్రజాపాలన ప్రతినిధి : నాదర్గుల్ అంబేద్కర్ నగర్ బస్తీలో ప్రతి ఇంట్లో మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రెటరీ బంగారు బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం లో దళిత - గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం మంగళవారం బడగ్ పేట్ కార్పొరేషన్ నాదర్ గుల్ అంబేద్కర్ నగర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పీసీసీ సెక్రెటరీ బంగారి బాబు, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబావి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు నిరుపేదలకు, ఇప్పుడు కూడా అండగా నిలుస్తున్న పార్టీనీ పలువురు నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. దేపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి అన్నారు, డబుల్ బెడ్ రూమ్స్ అని అబద్ధపు వాగ్ధానాలు చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. దళితులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి, ప్రశ్నించే వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అణచివేత అధికమౌతే, తిరుగుబాటు తీవ్రమౌతుంది అని హెచ్చరించారు. జిల్లా పిసిసి సెక్రెటరీ మాట్లాడుతూ... వచ్చి 2023 సం లో కాంగ్రెస్ పార్టీ నాదర్గుల్ గ్రామంలో ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ దళిత- గిరిజన ఒకతాటిపై నిలబడడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సిసెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి.ఆనంద్ రెడ్డి, పి.జగన్, ఎం.తిరుపతి రెడ్డి, బంగారి అశోక్, ఎం.నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు సుబాన్ యాదవ్, రాజు, వై.బాల్ రాజు, మక్కం రమేష్, మహిపాల్, భాస్కర్, యాదగిరి, పుట్టగళ్ల అశోక్, నరేష్, చిత్రం సూరి, కే.యాదగిరి, కే.మహీందర్, నళ్లేంకి ధన్ రాజ్ గౌడ్, రమేష్ నేత, బాకీ జాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.