కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు మధిర నవంబర్ 13 ప్రజాపాలన ప్

Published: Tuesday November 15, 2022
 మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని నెహ్రూ గారికి చిత్రపటానికి..  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. చిన్నపిల్లలు అంటే అమితమైన ప్రేమ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఉంది కనుక ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుకోవడం విశేషం.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు.  బెల్జియంలో జరిగిన ” అణ‌గారిన‌ జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు.1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  1930-35 మధ్యకాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంతోపాటు ఇతర అనేక నిరసన కార్యక్రమాల సందర్భంగా నెహ్రూ పలుమార్లు అరెస్టై  1946 జులై 6న కాంగ్రెస్కు అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 1951 నుంచి 1954 వరకూ మరో మూడు ప‌ర్యాయాలు ఆయ‌న తిరిగి ఈ ప‌ద‌విని చేప‌ట్టారు.అని అన్నారు..ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు* సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *కర్నాటి రామారావు, పారుపల్లి విజయకుమార్* పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు *బిట్రా ఉద్దండయ్య* మధిర పట్టణ డివిజన్ కమిటీ అధ్యక్షులు *బోల్లెద్దు రాజేంద్ర, రామారావు, మైలవరపు చక్రి, ఆదిమూలం శ్రీనివాసరావు, పుల్లూరి బాబు, మోదుగు బాబు, నూరు మొహమ్మద్, మొహమ్మద్ రహీం* మొదలగు వారు పాల్గొన్నారు