ప్రజలకు ఆరోగ్యకరమైన సేవలు అందించాలి. -నవజాతి శిశు మరణాలు జరగకుండా జాగ్రత్త వహించాలి. -రంగారె

Published: Wednesday November 02, 2022
చేవెళ్ల,నవంబర్ 01 (ప్రజాపాలన):

రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి
బి.వెంకటేశ్వరావు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆలూరులో ఇన్స్పెక్షన్ చేశారు.తర్వాత స్టాఫ్ అందరితో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా అందరూ డ్రెస్ కోడ్ పాటించినందుకు  స్టాఫ్ నర్సులను అభినందించారు అలాగే నవజాత శిశువుల గురించి, నవజాత శిశు మరణాల గురించి వారి జాగ్రత్తలు, ఫ్రీ మెచ్యూర్ డెలివరీ లోబర్త్ వైట్ మాతృ మరణాల గురించి గర్భిణీల రిజిస్ట్రేషన్  స్టాప్ అందరికీ దిశా దశ నిర్దేశించి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్స్ ను అందరూ రీచ్ అయ్యి ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితిని కల్పించాలని ఎక్కడ కూడా క్రమశిక్షణ రాహిత్యం జరగకూడదని హెచ్చరించారు. వైద్య సిబ్బంది సకాలంలో విచ్చేసి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని సూచించారు
ఈ సమావేశానికి  శ్రీనివాస్, సిహెచ్ఓ గోపాల్ రెడ్డి ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘు బాబు, డివిజన్ హెల్త్ ఎజికేటర్ సుదర్శన్, పీహెచ్ఎల్ సూపర్వైజర్స్, ఏఎన్ఎం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు