పర్యావరణ మిత్ర అవార్డుకు ఎంపికైన చాంద్ బేగం

Published: Tuesday June 22, 2021
మధిర, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీమతి చాంద్ బేగంకు ఈరోజు మాటూర్ హైస్కూల్ నందు మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది శ్రీమతి చాంద్ బేగం వేసవి సెలవులు వృధా కానీయకుండా వివిధ రకాల సంస్థలు నిర్వహించిన కళా సాహితీ పోటీలలో పాల్గొని వివిధ రకాల అవార్డులకు ఎంపిక కావటం జరిగిందని, వాటిలో సాహితీ బృందావన నేషనల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాసిన కవితాలకు కమిటీ వారు పర్యావరణ మిత్ర అవార్డు అందించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్బంగా చాంద్ బేగం రాసిన కవితలకు నెల్లుట్ల సునీత గారు ఉమెన్స్ ట్రస్ట్ మాతృసేవ అవార్డు, కళానిధి అనే బిరుదు అందుకోవటం మాటూర్ గ్రామానికే గర్వకారణమని ప్రభాకర్ పేర్కొన్నారుఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ చాంద్ బేగం గతంలో సాంస్కృతిక కళా రంగంలో జాతీయ అవార్డులు జిల్లా ఉత్తమ టీచర్ అవార్డ్ పొందారని పేర్కొంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.