పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నేలకొండపల్లి మండ లానికి చెందిన హరిత

Published: Monday October 11, 2021
పాలేరు, అక్టోబర్ 10, ప్రజాపాలన( ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన పి ఆర్ టి యు 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నేలకొండపల్లి మండ లానికి చెందిన శ్రీమతి J.హరిత రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా మరియు శ్రీ రేపాల శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎన్నిక కాబడినారు. నేలకొండపల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ T. రత్నకుమార్, శ్రీ T. రమేష్ లు వీరికి రాష్ట్ర కమిటీ లో నియమించబడినందున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ సమావేశంలో 1) సి పి ఎస్ రద్దు 2) 30/9/ 2021 విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ జరిపించటం. 3) 398 ఉపాధ్యాయులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఉత్తర్వులు ఇప్పించడం 4) 2016 వేసవికాలంలో పనిచేసిన ఉపాధ్యాయులకు E. L.s ఇప్పించడం. 5) 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు అదేవిధంగా 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా ఇప్పించడం. 6) పాఠశాలలో పూర్తికాలం పనిచేసే విధంగా స్కావెంజర్ లను నియమించుట మొదలగు ఉపాధ్యాయుల యొక్క సమస్యలలో కొన్నింటికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలియజేశారు.