గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం : సర్పంచ్ చెరుకూరి అండాలు గిరి

Published: Tuesday October 19, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి : గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేయనున్నట్లు సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు వంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలో గల గ్రామ కంఠం స్థలాలను గుర్తించి హద్దులు వేయించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. దీంతో పాటు లే అవుట్ లో పార్క్ స్థలాలను కాపాడాలని గ్రామస్తులు సభ దృష్టికి తీసుకురాగా త్వరలోనే దీనిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణలో వెంచర్ల ను గుర్తించి స్థలాలను గుర్తించడం జరుగుతుందన్నారు.గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో పలు మార్లు పెచ్చు లు ఊడిపోయి ఇబ్బందులు పడుతున్నారని దీనిపై సభలో నూతన గ్రామ పంచాయతీ తీర్మానం పెట్టాలని సభలో కోరారు. దీంతో సభ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గత  ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ నిధుల నుండి నిర్మించిన గ్రంధాలయం శిథిలావస్థకు చేరిందని వెంటనే మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని ప్రజలు సభ దృష్టికి తీసుకురాగా త్వరలోనే మరమ్మతులు చేపడతామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చెరుకూరి మంగ రవీందర్, ఉప సర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాధ, ఉపాధి హామీ టెక్నీకల్ అసిస్టెంట్, ఆశ వర్కర్లు, అంగన్ వాడి టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.