ఆరోగ్యమే మేళ ప్రజల నుండి విశేష స్పందన

Published: Friday April 22, 2022
మధిర ప్రజాపాలన ప్రతినిధి 21 ఏప్రిల్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ప్రభుత్వ హాస్పటల్ లో ఆరోగ్యమే మేళా ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ గౌతం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సభాధ్యక్షులుగా డీఎంహెచ్ఓ ఈ కార్యక్రమంప్రారంభ సభలో కలెక్టర్ ఈ కార్యక్రమానికి ప్రారంభించి పలు సూచనలు సూచించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో చిన్న జబ్బుల నుండి గుండె జబ్బుల వరకు వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి జిల్లాకు మెడికల్ కాలేజి మంజూరు ఐనదిజిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి మధిర ఆసుపత్రిలో ఈసిజి అందుబాటులో ఉంది షుగర్ కి బిపి కి అన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి మన జిల్లాలో డి హబ్ అందుబాటులో ఉంది. 57 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉచితంగా చేస్తారు. జిల్లా ఆసుపత్రిలో త్వరలోనే తల్లిపాలు స్టోర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువుగా జరగాలి ప్రవేట్ వైద్యులు సిజేరియన్ను ప్రోత్సహించ వద్దు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్ శ్రీనివాస్ జిల్లా సూపర్నెంట్ వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్మన్ లతా మండల ఎంపిపి లలిత మార్కెట్ యాడ్ చైర్మన్ నాగేశ్వరావు కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు రైతుబంధు చైర్మన్ వేణు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు