సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతకమ్మ

Published: Monday September 26, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ఆయన అన్నారు.ఖమ్మం జిల్లా ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటిచెప్పే తీరొక్క రంగులతో తీరొక్క పూలతో జరిగే బతుకమ్మ పండుగ సంబరాలను  తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకరాలు వైఎస్ షర్మిల ఆదేశాలు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.