లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ** తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ ** జిల్
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్29 (ప్రజాపాలన, ప్రతినిధి) : లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, జిల్లా ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చిందని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ గురువారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కొట్నాక విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 30వ తేదీ శుక్రవారం ఆదివాసీ గూడలో గ్రామంలో ఒకరోజు నిరసన దీక్షలు చేపట్టాలని తుడుం దెబ్బ పిలుపు నిచ్చిందన్నారు. అదేవిధంగా కేబీ ఆసిఫాబాద్ జిల్లాలో కమిటీ, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, అనుబంధ సంఘాలు, గ్రామాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కార్మిక కర్షక వర్గాల యువతీ యువకులు, విద్యార్థినీ విద్యార్థులు ఉద్యోగులు, ప్రజలు, పెద్ద ఎత్తున తమ తమ గ్రామాలలో, వాడలలో నేడు శుక్రవారం నిరసన దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, స్వామీజీ, నాయకులు అత్రం సాయినాథ్, మారుతి, తదితరులు ఉన్నారు.
Share this on your social network: