టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిఎస్టి రేటు పెంపు నిరసన ధర్నా మధిర రూరల్

Published: Thursday July 21, 2022

జూలై 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ రేటు పెంపుకు నిరసనగా ధర్నా జీఎస్టీ రేట్ల పెంపు పై మధిర లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన ధర్నా.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం  వరుసగా పెంచుకుంటూ పోతున్న నిత్యావసర ధరలపై మరియు జీఎస్టీ రేట్ల పెంపు పై బుధవారం నాడు మధిర పట్టణంలోని వైరా రోడ్డు వై.ఎస్.ఆర్ సెంటర్ నందు టిఆర్ఎస్ పార్టీ మధిర పట్టణ మరియు మండల కమిటీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా మరియు గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల ,పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి, నాయకులు ఎర్రగుంట రమేష్, ముత్తవరపు ప్యారీ, గద్దల నాని, జెవి రెడ్డి, ఆళ్ల నాగబాబు, గద్దల రాజా, హరి కిరణ్ కాంత్, పల్లపోతుల ప్రసాద్, ఖాదర్, వేల్పుల శివ, జగన్నాధ చారి, గుగులోతు కృష్ణ, సోషల్ మీడియా అధ్యక్షుడు హనుమంతరావు, శంకరా చారి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు