*బిఆర్ఎస్ తోనే పంచాయితీల అభివృద్ధి* *70 లక్షలతో కేశవ గూడ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి : జడ్పిటిస

Published: Monday April 03, 2023
 *ప్రజాపాలన ప్రతినిధి షాబాద్*= వెనకబడిన కేశవ గూడ పంచాయతీ సర్వతోముఖాభివృద్ధి కి 
రూ. 70 లక్షలు అందించామని షాబాద్   జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. 
ఆదివారం రూ. 10 లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాల పనులను ఆయన సర్పంచ్ కవిత నర్సింహ్మ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతీ పల్లెను అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీలను ఏర్పాటుచేయగా, అప్పటి జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చొరవతో కేశవ గూడ పంచాయతీ ఏర్పడిందన్నారు. అనంతరం పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దశల వారిగా ఇప్పటి వరకు చేవెళ్ల ఎంఎల్ఏ యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్  తీగల అనిత రెడ్డి ల సహకారంతో 
 రూ. 70 లక్షల నిధులను విడుదల చేయించామని చెప్పారు. ఇందులో సుమారు 30 లక్షల రూపాయల ను అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, మరో 35 లక్షలు యూజీడీలు ఇతర పనులకు అందించినట్లు అవినాష్  రెడ్డి వెల్లడించారు. ఇంకనూ మిగిలిపోయిన పనులకు   నిధులను కేటాయిస్తామని అవినాష్ రెడ్డి చెప్పారు. సర్పంచ్ కవిత మాట్లాడుతు తమ పంచాయతీలో నిండిన సమస్యల పరిష్కారం కోసం తమకు నిధులు అందించిన అవినాష్ రెడ్డి కి రుణపడి ఉంటామన్నారు. మిగిలిన వాటి పరిష్కారం కోసం మరో రూ. 10 లక్షల నిధులను విడుదల చేయాలన్నారు . ఎంపిటీసీ మధుసూధన్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రాజయ్య,  వార్డు సభ్యులు, నాయకులు రాందేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.