గోదావరి ముంపు బాధితుల పోరాటానికి ఐ ఎఫ్ టి యు సంపూర్ణమద్దతు, వరద బాధితులకు ఇళ్ల స్థలాలు కేటా

Published: Friday January 06, 2023

 

        గిరిజన అభివృద్ధి నిధులు వారికే కేటాయించాలి

         గోదావరి ముంపు గ్రామాల ప్రజల ఇంటి స్థలాలు, కేటాయించాలని, పక్క ఇలా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని చేస్తున్న   పోరాటానికి ఐ ఎఫ్ టి యు మణుగూరు ఏరియా కమిటీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు బుధ వారం నాడు  కృష్ణ సాగర్ అటవీ ప్రాంతంలో మణుగూరు, కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు వేసుకుని ఆందోళన నిర్వహిస్తున్న శిబిరం వద్దకు చేరుకుని భూ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఐ ఎఫ్ టి యు అనుబంధ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి  ఎస్ డి  నా సర్ పాషా మాట్లాడుతూ  కనీవిననీ రీతిలో ఇటీవల గోదావరి భారీ ప్రళయం సృష్టించిందని అనేక గ్రామాలు జలమయం అయ్యాయని అనేకమంది ప్రజలు నిరాశ్రయులు  అయ్యారని కట్టు బట్టలతో  చెట్ల కింద పుట్ల కింద తలదాచుకున్నారని ఆపన్న హస్తాల కోసం అన్నమో  రామచంద్రా అంటూ అలమటించారని, ఈ నేపథ్యంలో గ్రామాల ప్రజలకు శాశ్వత సమస్య పరిష్కారం చూపిస్తారని వారికి పక్కా ఇళ్ళు మంజూరు చేస్తానని భద్రాచలం వరద ప్రాంత పర్యటనకు  వచ్చిన  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని  అట్టి హామీని అమలు చేయాలని , గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కూడా వాటిని దారి మళ్ళించారని ఆ సొమ్ముతో గిరిజన పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని నిరాశ్రయులు ఆందోళనలు చేస్తున్నారని వీరికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అండగా నిలబడిందని ఐ ఎఫ్ టి యు కూడా తమ సంపూర్ణ మద్దతును ఈ సందర్భంగా ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు మంజూరు చేయాలని ఆయన కోరారు, వాళ్ల ఖర్చులకోసం వ్యక్తిగతంగా  ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం ఆయన ప్రకటించారు నిరుపేదల పోరాటానికి దాతలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, మణుగూరు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్, సామాజిక కార్యకర్త నల్లమోతు సురేష్ , న్యూ డెమోక్రసీ, మరియు పోరాట కమిటీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, జక్కం కొండలరావు, బట్టు రవి, ఇరప మనోజ్, సున్నం భూలక్ష్మి, సుజాత, ఎట్టి లక్ష్మణ్, భద్రమ్మ, అనంతలక్ష్మి అలివేలు, తదితరులు పాల్గొన్నారు.        గిరిజన అభివృద్ధి నిధులు వారికే కేటాయించాలి