హైదరాబాద్ 23 డిసెంబర్ ప్రజాపాలన:

Published: Saturday December 24, 2022

 

 కర్నూలు జిల్లాలోని ఎస్ వి రెసిడెన్సి హోటల్ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  జి చెన్నయ్య హాజరై నాడు. మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కర కo మాధవస్వామి ఎన్నిక అయినట్లు   నియామక పత్రాన్ని అందజేశారు.  అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్సీ కార్పొరేషన్ గా ఉన్న దానిని మాల మాదిగ రెల్లి అని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్ లు ను ఎంపిక చేశారు. వాటి కి ఇంతవరకు డైరెక్టర్ లను నియమించలేదని అన్నారు. కార్పొరేషన్లకు ఇంతవరకు బడ్జెట్ కేటాయించలేదని సంబంధించిన నిధులను పక్కదారి పట్టించకుండా చూడాలని కోరారు.   ఈ ప్రభుత్వం మాకు కేటాయించిన బడ్జెట్  నిధులు మళ్ళించ కుండా చూడాలన్నారు. ఇంతవరకు ఉన్న దళిత 28 పథకాలను ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్.సి. ఎస్ .టి అట్రాసిటీ బాధితులకు రావలసిన జాబులు మరియు భూమి ఇలా పట్టాలు ఈ జిల్లాలో ఇవ్వడం లేదన్నారు.   ఈ జిల్లాలో సుమారు 100 వరకు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.సంబంధిత  అధికారుల నిర్లక్ష్యం వలన పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఎస్.సి,ఎస్టి, అట్రాసిటీ బాధితులకు రావాల్సిన మానిటరీ  బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులు సంబంధిత పోలీస్  స్టేషన్ కు వెలితే  ఎఫ్ఐఆర్ చేయకుండా  కాలయాపన చేసి  కేసులను నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఉన్న అధికారులు పోలీసులు పర్యవేక్షణ చేసి ఎస్, ఎస్టి బాధితులకు, అండగా ఉండాలని ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఈ ప్రభుత్వంలో దళితులను చిన్నచూపు చూడకుండా సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, చెన్నకేశవులు, రాజశేఖర్ ప్రసాద్,రూప దాసు,శివశంకర్, మాధవకృష్ణ,రంగముని,దాసరి సూర్య మోహన్,తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని ఎస్ వి రెసిడెన్సి హోటల్ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  జి చెన్నయ్య హాజరై నాడు. మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కర కo మాధవస్వామి ఎన్నిక అయినట్లు   నియామక పత్రాన్ని అందజేశారు.  అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్సీ కార్పొరేషన్ గా ఉన్న దానిని మాల మాదిగ రెల్లి అని మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్ లు ను ఎంపిక చేశారు. వాటి కి ఇంతవరకు డైరెక్టర్ లను నియమించలేదని అన్నారు. కార్పొరేషన్లకు ఇంతవరకు బడ్జెట్ కేటాయించలేదని సంబంధించిన నిధులను పక్కదారి పట్టించకుండా చూడాలని కోరారు.   ఈ ప్రభుత్వం మాకు కేటాయించిన బడ్జెట్  నిధులు మళ్ళించ కుండా చూడాలన్నారు. ఇంతవరకు ఉన్న దళిత 28 పథకాలను ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్.సి. ఎస్ .టి అట్రాసిటీ బాధితులకు రావలసిన జాబులు మరియు భూమి ఇలా పట్టాలు ఈ జిల్లాలో ఇవ్వడం లేదన్నారు.   ఈ జిల్లాలో సుమారు 100 వరకు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.సంబంధిత  అధికారుల నిర్లక్ష్యం వలన పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఎస్.సి,ఎస్టి, అట్రాసిటీ బాధితులకు రావాల్సిన మానిటరీ  బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులు సంబంధిత పోలీస్  స్టేషన్ కు వెలితే  ఎఫ్ఐఆర్ చేయకుండా  కాలయాపన చేసి  కేసులను నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఉన్న అధికారులు పోలీసులు పర్యవేక్షణ చేసి ఎస్, ఎస్టి బాధితులకు, అండగా ఉండాలని ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఈ ప్రభుత్వంలో దళితులను చిన్నచూపు చూడకుండా సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, చెన్నకేశవులు, రాజశేఖర్ ప్రసాద్,రూప దాసు,శివశంకర్, మాధవకృష్ణ,రంగముని,దాసరి సూర్య మోహన్,తదితరులు పాల్గొన్నారు.