ఆడబిడ్డలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. --ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Saturday October 01, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): ఆడబిడ్డల సంతోషమే ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుందని బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కానుక బతుకమ్మ చీర అని ఎమ్మెల్యే డా.సంజయ్ అన్నారు. తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బీర్ పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద  అడబిడ్డలకు 1549 బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పంపిణీ చేసినారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన 13మంది  లబ్ది దారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 3 లక్షల64 వేల రూపాయల విలువగల చెక్కులను, ముగ్గురు ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేసినారు. అనంతరం మాట్లాడుతూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభకాంక్షలు తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప రమేష్, ఎంపీపీ రమేష్,  కెడిసిసి జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోలుముల రమణ, మాజీ జెడ్పీటీసీ శంకర్, మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్, మండల రైతు బందు సమితి కన్వీనర్ లు రాజేశం, కొల శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్ రావు, గంగాధర్, ఉప సర్పంచ్ హరీష్, గ్రామ శాక అధ్యక్షులు సుధాకర్, ఎంపిడిఓ మల్లా రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.