మండలంలో ఘనంగా అమ్మవారి ఊరేగింపు నిమజ్జనోత్సవం

Published: Monday October 18, 2021
బోనకల్, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం లోని వివిధ గ్రామాలలో దుర్గామాత నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో అనగా రావినూతల గ్రామంలో మరియు తూర్పు తండ లో మరియు రాపల్లి గ్రామాలలో శ్రీ దుర్గా మాత అమ్మవారిని వివిధ అలంకారములతో భక్తి పూర్వకముగా శరన్నవరాత్రి మహోత్సవములను గ్రామాల్లో ఉన్న ప్రజల సహాయ సహకారాలతో అమ్మవారి నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రావినూతల గ్రామంలోసర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ఆధ్వర్యంలో చెరువు కట్ట దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారిని మరియు రావినూతల తూర్పు తండాలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గల అమ్మవారిని అదేవిధంగా రా పల్లి గ్రామంలో సర్పంచ్ మందడపు తిరుమల రావు ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి మహిళలు కోలాటం ఆడుతూ డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో నుత్య కళాకారులచే డీజే బాణసంచా వెలుగుల్లో అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా గ్రామాల్లో పురవీధులలో ఊరేగింపును  జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆటపాటలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నిమజ్జనోత్సవ కార్యక్రమానికి గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.