లక్ష కోవిడ్ టీకాలు లను ఉచితంగా అందిస్తున్న మలబార్ గోల్డ్

Published: Friday June 04, 2021
అమీర్ పేట్, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : ప్రముఖ వజ్ర ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ కోవిడ్ మహమ్మారి దేశం నుంచి రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంలో భాగంగా తమ వంతు సహాయంగా లక్ష కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ చైర్మన్ మహమ్మద్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ షోరూమ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్టోర్ హెడ్ షరీజ్ మాట్లాడుతూ... చేతివృత్తుల వారు, పెట్టుబడిదారులపై ఆధారపడిన కుటుంబాలు, వ్యాక్సిన్ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని అని తెలిపారు. ప్రస్తుతం టీక డ్రైవ్ కోసం ఎనిమిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా తమ బృందాలులోని సభ్యులను, భాగస్వామ్య సంస్థలను, సమాజాన్ని పరిరక్షించడానికి, సంరక్షించడానికి మలబార్ గ్రూప్ సంస్థ తమకు సాధ్యమైన కృషి చేస్తుందని తెలిపారు.