దేశ రాజకీయాలకు ప్రత్యామ్నాయం చూపనున్న బిఆర్ఎస్ పార్టీ * వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుక

Published: Friday January 13, 2023

వికారాబాద్ బ్యూరో 12 జనవరి ప్రజా పాలన : రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశం చేస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం కోటపల్లి మండల కేంద్రంలో మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ అధ్యక్షతన ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో గుర్తించి అవార్డులు రివార్డులు కొల్లగొట్టడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రతి బి.ఆర్.ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని సూచించారు. దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో పెల్లగించిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు. క్రమశిక్షణతో పార్టీ సూచించిన నియమ నిబంధనలను ప్రతి కార్యకర్త అనుసరించాలని వివరించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను సమయానుకూలంగా గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మాట్లాడుతూ పార్టీ కొరకు ప్రతి కార్యకర్తను చైతన్యవంతం చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల పాలన కంటే బి.ఆర్.ఎస్ పార్టీ పాలన శ్రేష్టమని కొనియాడారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధికి మనుగడకు ప్రతి కార్యకర్త నడుం బిగించి శాయశక్తుల ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీపరంగా అంతర్గతంగా గాని బహిర్గతంగా గాని ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తేవాలని సూచించారు. నా వలన పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. నా తాహతుకు మించి వచ్చిన సమస్యలను పై అధినాయకత్వానికి విన్నవించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రా రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, రైతు బంధు అధ్యక్షులు సత్యం, ఏఎంసి వైస్ చైర్మన్ దశరథ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు,  ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.