మహిళా రిజర్వేషన్ కల్పనలో ప్రభుత్వం వైఫల్యం ఐద్వా‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

Published: Wednesday August 24, 2022
కరీంనగర్ ప్రజాపాలన ఆగస్టు 23 :
 
 మహిళలు అన్ని రంగాలలో రాణించకుండా ప్రభుత్వాలు నేటికీ వివక్షత చూపుతున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన క్యాదర్శి మల్లు లక్మి ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, సమాజంలో సగభాగం ఉన్న మహిళలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పప్పు,ఉప్పు,కారం,పాలు పెరుగు వంటి నిత్యవసర సరుకుల ధరలపై GST వేసి పేదలపై తీవ్రభారాలు వేసిందని మండిపడ్డారు.
సమాజంలో మహిళలు  అడుగడుగునా వేధింపులకు గురవుతున్నారని, మహిళలను వంటింటికే పరిమితం చేయాలని కేంద్రమంత్రి స్వయంగా ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు.
ఆకాశంలో విహరించే విమానాలు నడిపిన, నింగిలో మెట్రో రైలు నడిపిన అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలపై నేటికీ వివక్ష కొనసాగుతుందని అన్నారు.
ప్రేమించడం లేదని ప్రేమోన్మాదులు గొంతు కోస్తున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రేమించిన వారిని మోసం చేస్తున్నారని, అత్యధికంగా కట్నకానుకలు ఇచ్చుకున్నప్పటికీ అదనపు కట్నం కావాలని గృహ హింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళాలపై వేధింపులు అరికట్టాలని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలపై ఐద్వా నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఎక్కడైతే మహిళలపై అన్యాయం జరుగుతుందో లైంగిక దాడులు జరుగుతున్నాయో వాటిపైన ఐద్వ మహిళా సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, ఇలాంటి పోరాటంలో మహిళలు పెద్ద ఎత్తునముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కృష్ణవేణి, పూజ,యమునా,జి.సంధ్య,R.భవాని,యం.లావణ్య,అన్నపూర్ణ,జరీనాబేగం,శారద,లక్ష్మీ,రజిత,రాజకుమారి, ప్రమీల,సుజాత,ఎన్.లావణ్య తదితరులు పాల్గొన్నారు.