ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నీ అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని చైర్మెన్ చిన్న గంటి రాజశ

Published: Thursday March 31, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సర్వసభ్య సమావేశం పిఏసిఎస్ చైర్మన్ చిన్న గంట రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల సమక్షంలో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఈ పంటకు పోల్కంపల్లి లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, బంగారంపై నలభై వడ్డీరేట్లను తగ్గించాలని, అదేవిధంగా రుణమాఫీలు సకాలంలో చెల్లించే విధంగా చూడాలని  కోరారు. ఈ విషయంపై స్పందించిన  పిఎసిఎస్ అధ్యక్షులు  చైర్మన్ చిన్నగంట రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన సహకార బ్యాంకు బకాయిలు చాలా ఉన్నాయని, పూర్తిగా చెల్లించి తిరిగి రుణాలు పొందాలని సూచించారు. రైతులందరూ సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని రైతులను కోరారు. రైతులకు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే విధంగా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన వేముల లక్ష్మణ్ రావు, డైరెక్టర్లు  కొమ్మిడి శేఖర్ రెడ్డి, ఎరకాలి బాలయ్య, గోరెడ్డి భారతమ్మ, కొమ్మిడి జగన్ రెడ్డి, సింగు ప్రభాకర్ రెడ్డి, కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మిడి నరసింహారెడ్డి, కనుకుల మల్లేష్, మాచర్ల రాములు, లక్కుమాల్ల యాదమ్మ, బర్తల లక్ష్మయ్య, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మయ్య, మేనేజర్ డి రాజేష్, అకౌంటెంట్ నర్సింహా, సిబ్బంది ఎం రవి, ఈట మంగ, రైతులు  తదితరులు పాల్గొన్నారు.