*ఐకేపీ విఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

Published: Friday August 26, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 25, ప్రజాపాలన :   ఐకేపీ విఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలానీ గురువారం రోజున ఇంధిర పార్క్  వద్ద ధర్నాలో    మంచిర్యాల జిల్లా నుండి విఓఏ ఉద్యోగులు 260 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo ఏర్పడి సంవత్సరాలు గడిచిన ఐకేపీ విఓఏల ఉద్యోగుల పరిస్థితి అగమ్య గొచరంగా మారింది. కనీస వేతనం లేదు , ఉద్యోగ భద్రత లేదు , హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, టార్గెట్స్ పేరుతో వేధింపులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని లేకాపోతే సీఐటీయు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ విఓఏల ఉద్యోగుల  సంఘం జిల్లా  అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుంటాల కుమార్, జుమ్మిడి లక్ష్మణ్,జిల్లా కోశాధికారి దుర్గం రాము,  ఉపాధ్యక్షులు దాసు,ధర్మయ్య, శారదా, అనిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.