యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

Published: Wednesday December 08, 2021
మండల వ్యవసాయ అధికారి నారాయణ..
పాలేరు, డిశంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని నేలకొండపల్లి మండల వ్యవసాయ అధికారి నారాయణ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని చెరువుమాదారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంట లపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరి పంటను కేంద్రం కొను గోలు చేసే అవకాశం లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇకపై ఉండవన్నారు. వరి మాత్రమే పండిస్తామనే రైతులు విత్తన ఉత్పత్తి కంపెనీలు, రైసుమిల్లర్లతో అగ్రిమెంటు ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. వరి సాగుకు బదులుగా పప్పు దినుసు పంటలైన పెసర, మిను ము, వేరుశనగ, జొన్నలు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శిరీష, సొసైటీ చైర్మన్ పగిడిపత్తి శ్రీను, మాజీ చైర్మన్ ఈవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.