అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్

Published: Thursday March 24, 2022
హైదరాబాద్ 23 మార్చి ప్రజాపాలన: ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఆందోల్  డివిజన్  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్  శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు పనులను బుధవారం నాడు తనిఖీ చేశారు.నాణ్యత ప్రమాణాలు పాటించాలని సకాలంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ లను ఆదేశించారు. రూర్బన్ పథకం కింద మంజూరైన నారాయణ్ ఖేడ్ జుక్కల్ శివారు లోని సమావేశ మందిరం, ఆక్సిజన్ పార్క్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా మంజూరైన మోర్గి రోడ్ మరియు బ్రిడ్జి, ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిమెంట్ రోడ్లు తదితర పనులను తనిఖీ చేశారు. నారాయణ్ ఖేడ్ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.కొండయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ సిహెచ్. రాకేశ్ కుమార్ సంబంధిత కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.