విద్యార్థులకు పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Monday September 05, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక గిరిజన సంక్షేమ గురుకులాలలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, భోజనం చేసే ముందు చేతులు శుభ్రం, తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సాంబార్లో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ తో కలిసి స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమమునకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 5 నుండి 11 వ తేదీ వరకు "స్వచ్ఛ గురుకుల్ "కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని సిర్పూర్ (టీ), కాగజ్నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన లలో గల సాంఘిక సంక్షేమ గురుకులాల్లో, కెరమెరి లోని గిరిజన సంక్షేమ గురుకులంలో విద్యార్థులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించేలా సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, చొరవ తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల్లో వంట చాలా భోజనశాల, పాఠశాల ఆవరణ, మూత్రశాలలు, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి ఓ బాలరాజు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంగీత, జ్యోతి, సంధ్యారాణి, శ్రీనివాస్,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.