హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఐడి పత్రాలు అందించిన హైకోర్టు న్యాయవాది..

Published: Friday April 14, 2023
తల్లాడ, ఏప్రిల్ 13 (ప్రజాపాలన న్యూస్): 
 ఖమ్మం జిల్లా ప్రస్తుత మన దేశ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల నుండీ అనేక రకాల పతకాలు చేయుతా రుణాల రూపంలో పేద ప్రజలకు  సామాజిక కార్యకర్తలకు పలు రకాల చిరు వ్యాపారులకు ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు రుణాల గూర్చి సమాచారం అందించాల్సిన బాధ్యత ఉంది అనే సంగతీ చాలా మంది ప్రజలు అవగాహన లేదూ అంటూ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపాటి దాసు, ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయవాదీ యమ్ సంధ్యా రాణి పాత్రికేయుల సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా బాధ్యులు కె అన్నపూర్ణ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులను వారి వారి కార్యాలయాలు సందర్శించి హ్యూమన్  రైట్స్ ఫౌండేషన్  చేస్తున్న సేవలూ అవగాహన కార్యక్రమాలు గూర్చి జిల్లా అధికారిలకు వివరించి మేమూ ఏర్పాటు చేస్తున్న అవగాహన సదస్సులకు హాజరు కావాలంటూ విన్నవించి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో హై కోర్టు లాయర్  యమ్.సంధ్యారాణి, జాతీయ అధ్యక్షులు హెచ్ ఆర్ యాప్ రథసారథి డాక్టర్ బొడ్డపాటి దాసు,మేకతోటి శశి కిరణ్, అన్నపూర్ణ, మణి, సాహేరా, రుక్మిణి, నాని, రామకృష్ణ, నిర్మల, ఎన్జీవో మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ ఇశ్నపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఏపీ హై కోర్ట్ లాయర్ కి ధన్యవాదాలు తెలిపిన ఖమ్మం జిల్లా సామాజిక కార్యకర్తలు.