మీరిచ్చిన రక్తం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం ఔతుంది. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Thursday August 18, 2022
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 17, ప్రజాపాలన  :
 
రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితులలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడిన వారవుతారని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. స్వతంత్ర భారత వత్రోత్సవ మహోత్సంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు.ఇచ్చిన రక్తం  తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను రక్షించుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా మరింత ఆరోగ్యవంతుల వుతారని తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో గుడిపేట బెటాలియన్ పోలీసులు, మున్సిపల్ కార్మికులు, విద్యుత్ శాఖ సిబ్బంది, సింగరేణి కార్మికులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని, 75 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, కుల, మతాలకు అతీతంగా రక్తం అత్యవసరం ఉన్న వారికి అందించడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ధృవపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుబ్బారాయుడు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య. 13వ బెటాలియన్ డి.ఎన్.పి. రఘునాథ్ చౌహాన్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.