కార్పొరేషన్ లో ముందుగా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి : శూర్ణ కర్ణ రెడ్డి

Published: Monday October 11, 2021
బాలాపూర్, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోమటికుంట చెరువు పోచమ్మ కుంట చెరువు విపరీతంగా అలుగు రావడంతో సి వై ఆర్ కాలనీ, సి ఎం ఆర్ కాలనీ, మధుర పూరి కాలనీ అమరావతి కాలనీ, బి ఎస్ ఆర్ నగర్, బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ, జంగారెడ్డి కాలనీ, మల్లారెడ్డి నగర్ కాలనీ, పూర్తిగా నీట మునిగి పోవడం జరిగిందినీ, చెట్లువిరిగి కోల్పోవడం జరిగిందినీ, రోడ్లు గుంతలు పడి కొట్టుకుపోవడం జరుగుతుదినీ, మెయిన్ రోడ్డు పూర్తిగా పాడు అయిపోవడం జరిగిందినీ. అనేకమందికి కాలనీ ప్రజలకు తీవ్రమైన ఆస్తినష్టం జరిగిందినీ, ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు, నిత్యవసర వస్తువులు, వాహనాలు, ఇతర వస్తు సామాగ్రి పూర్తిగా నీటమునిగి తీవ్రగా నష్టపోవడం జరిగిందినీ స్థానిక కార్పొరేటర్ తో పాటు బీజేవైఎం రాష్ట్ర యువత అధ్యక్షులు శూర్ణకర్ణ రెడ్డి అన్నారు. వర్షం వస్తుంది అంటే కాలనీ ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తోందినీ అన్నారు. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని రాత్రంతా జాగరణ చేయాలా... సొంత ఇల్లు వదిలి పెట్టి పోవలసి వస్తుందో... అని గత సంవత్సరం కూడా ఇదే రకంగా భారీ వరదలు రావడం అప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టం జరిగిందినీ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద నీటి పైప్ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. చెరువుల సుందరీకరణ పేరుతో చెరువులను కుదించడంతో చెరువులో నీళ్లు కాలనీ లోకి రావడం జరుగుతుంది. చెరువులు కాస్త కుంటలు గా మారి చిన్నపాటి వర్షానికి అలుగులు పరడంతో కాలనీలు నీట మునిగి పోవడం జరుగుతుందినీ, చెరువుల సుందరీకరణ కన్నా ముందు చెరువులోకి డ్రైనేజీ నీళ్లు రాకుండ చూడాలని ట్రంకు లైన్ పూర్తిచేయాలని స్థానిక కార్పొరేటర్ రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి, బిజెపి బీజేవైఎం రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు రామిడి శూరకర్ణ రెడ్డి ప్రాధేయపడుతూ కోరారు.