రైతులకు ఒడ్ల కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలిరైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ల

Published: Tuesday December 20, 2022
రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల దోపిడీవెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని బిజెపి డిమాండ్*.
ఎరుపాలెం డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెంమండలం ఎర్రుపాలెం మండలంకేంద్రం లో వ్యవసాయ మార్కెట్ నందు ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. కేంద్రం ఇస్తున్న రైతులకు గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులపట్ల నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్నది.  ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తరుగు ఇతర ఖర్చులు భారం వేస్తున్నది.ఇక్కడ మౌలిక వసతులు లేవు కనీసం వర్షం వస్తే తగిన సదుపాయాలు లేవు. ఒడ్లు ఆరుదలకు ప్లాట్ ఫామ్స్ లేవు అని కిసాన్ మోర్చా సంబంధిత అధికారాలను నిలదీసినది. వెంటనే రైతులకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని బిజెపి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నది.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు, మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, రాష్ట్ర sc మోర్చా కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, బిజెపి జిల్లా కార్యదర్శి ఎర్రుపాలెం ఇంచార్జి చిలివేరు సాంబశివరావు, మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు,జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, కిసానమోర్చా మండల అధ్యక్షులు మిరియాల నాగేశ్వరావు,దళితమోర్చా జిల్లా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరరావు, ఓబీసీ మండల అధ్యక్షులు రామకృష్ణ,పార్టీ ఉపాధ్యక్షులు బొక్కా రమేష్, మల్లెల మోహనరావు, మిరియాల వెంకటేశ్వర్లు, కోటా మర్తి ధర్మ, కొండలరావు హేమ, మరియు రైతులు పాల్గొన్నారు.