పల్లె పల్లెలో బోనాలు ముత్యాలమ్మ తల్లి వేడుకలు..

Published: Wednesday August 25, 2021
పాలేరు ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో శ్రావణమాసంలో ఆరాధ్య దైవంగా కొలిచే ముత్యాలమ్మ తల్లి బోనాలు వేడుకను పల్లెల్లో ఘనంగా నిర్వహించారు బోనాలు ఎత్తుకుని. వేటపోతులు కోళ్లు కొబ్బరి కాయలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు గురువారం మండలంలోని కోనాయిగూడెం, కోరట్లగూడెం, నేలకొండపల్లి తదితర గ్రామాల్లో ముత్యాలమ్మ తల్లి మొక్కలు చెల్లించుకున్నారు. కోనాయిగూడెం లో సొసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి, సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, వేడుకల్లో పాల్గొన్నారు బోయినపల్లి, నాగమణి, మేకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..