మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు

Published: Saturday December 31, 2022
అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు.
- జిల్లా ఎస్పీ యన్. కోటి రెడ్డి
వికారాబాద్ బ్యూరో 30 డిసెంబర్ ప్రజా పాలన : మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదు అని అన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం.
బైరీ నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ నందు cr. No.185/2022 u/s 153(A), 295(A),298, 505(2) IPC లో కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తాము. జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ లు నిర్వహించేటప్పుడు మీటింగ్ నిర్వాహకులు  ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు. ఇలాంటి వారిని ప్రోత్సహించి శాంతికి విఘాతం కలగచేసిన నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.