విశ్వకర్మ సంఘం అధ్యక్ష రేసులో కృష్ణమూర్తిచారి

Published: Tuesday March 16, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : అన్నా అంటే నేనున్నా అంటూ ఎందరో నిరుపేదలను తనకు తోచిన విధంగా ఆదుకుంటూ, మండల పరిధిలో పలువురికి ఆర్ధిక సహాయం చేయడంతో పాటు అందరితో మనసున్న మారాజు అనిపించుకున్న కృష్ణమూర్తిచారి రామచంద్రపురం మండల అధ్యక్ష పదవికి అర్హుడనని పలువుర విశ్వబ్రాహ్మణులు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. రాoచంద్రాపురం శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కే కృష్ణమూర్తి చారి, విశ్వబ్రాహ్మణ- విశ్వకర్మ ఐక్య సంఘం, తెలంగాణ రాష్ట్ర సంఘంలో వేదాస్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి రామచంద్రపురం మండలం తరపున, మండల అధ్యక్షునిగా తనను గెలిపించాలని కృష్ణ మూర్తి చారి కోరారు. సంఘం ఎన్నికలు ఈ నెల 21 నాడు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయని, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తాను ప్రజలకు సుపరిచితుడినని, కావునా మండల అధ్యక్షునిగా తనను గెలిపించాల్సిందిగా కృష్ణ మూర్తి చారి అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఎర్రోజు బిక్షపతి చారి, సంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అశోక్ చారి, విశ్వకర్మ ఐక్య సంఘం ప్రతినిధులు సుదర్శన చారి, భరత్ చారి, శ్రీనివాస్ చారి, రాజేందర్ చారి, కమ్మరి శ్రీనివాస్  చారి, బ్రహ్మ చారి, మోహన్ చారి తదితరులు పాల్గొన్నారు.