కరోనాలో వైద్య సిబ్బంది అందించిన సేవలు భేష్

Published: Wednesday July 28, 2021
మేడిపల్లి, జూలై 27 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రపంచ దేశాలను గజగజలాడించిన మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడంలో భాగంగా ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవి కుమార్ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా బెస్ట్  కరోనా వారియర్స్ అవార్డు అందుకున్న వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి బహుమతులుగా స్మార్ట్ వాచీలను అందజేశారు. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది చేసిన కృషినీ ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సౌందర్యలత, డాక్టర్ స్వప్నిక, వైద్య సూపర్వైజర్ భోగ ప్రకాష్, మెడికల్ సూపర్వైజర్  గోంగడయ్య, ఏఎన్ఎం మంగమ్మ, ఆశ వర్కర్ శోభ, ల్యాబ్ టెక్నీషియన్ భగత్ టీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, బద్రుద్దీన్, ముత్యంరెడ్డి, సూరంశంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.