మోడీ పాలనలో రాజ్యాంగం హక్కులపై దాడి కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్

Published: Monday July 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై24(ప్రజాపాలన, ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పారపు సురేష్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో జిల్లా రెండవ మహాసభలు జాడి మల్లయ్య అధ్యక్షతనలో జరిగాయి. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, ఆశయాల జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి మల్లయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిప్పారపు సురేష్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దళితుల హక్కులు హరించ బడుతున్నాయని అన్నారు. మతం జాతి కులం లింగవివక్ష నిషేధించబడిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నేటికీ వివక్ష తీవ్రంగా కొనసాగుతుందని అన్నారు. కావున రాజ్యాంగ హక్కులు నేడు ప్రమాదంలో ఉన్నాయని, వాటి రక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు.
"కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకరన్ మాట్లాడుతూ" తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం దళిత బందును ప్రవేశపెట్టి ఎమ్మెల్యేలకు ప్రక్రియను ఇవ్వడంతో అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి  దళిత కుటుంబానికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్, నాయకులు వినోద్,శ్రీనివాస్, శ్యామ్ రావు, రవి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.