చెట్లే మానవాళికి జీవనాధారం : భేరీ రామచందర్ యాదవ్ పూజారి

Published: Saturday May 08, 2021
పూడూరు, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : పూడూరు మండల్ మిట్ట కంకల్ గ్రామం పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ మొర్రి శ్యామ్ కుమార్ ఉప సర్పంచ్ భేరీ రామ్ చందర్ యాదవ్ మొన్న కురిసిన వర్షాల గాలి వాన ల వల్ల పల్లె వనం ప్రకృతి పార్క్ లో చెట్లు గాలివానకు పడిపోగా, కర్రల సహాయంతో నిలబెట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ మొక్కలని సంరక్షించి కాపాడే బాధ్యత మన అందరిదీ అని అన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిదగ్గర మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ఇంటి యజమాని తీసుకోవాలని అన్నారు మన రాబోయే తరాలకు మంచి గాలి మంచి నీరు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు గ్రామంలోని పెద్దలు మహిళలు యువజన నాయకులు ప్రతి ఒక్కరూ మొక్కలని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు మొక్కలు పెరిగి పెద్దగా అయి మంచి గాలిని మంచి పండ్లు ల అని మనందరికీ అందిస్తాయన్నారు ఇప్పుడు మనం తినే పండ్లు మన పూర్వీకులు మన పెద్దలు మన కోసం ఆలోచించి చెట్లు నాటారు అప్పట్లో ఆ చెట్లు ఇప్పుడు మనకు మంచి గాలి మంచి ఫలాలు అందిస్తున్నాయి చెట్లు ప్రకృతిలో భాగం వాటిని కాపాడే బాధ్యత మన అందరిదీ అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువజన నాయకులు రావుల దశరత్, పెద్ద బందయ్య, చిన్న బందయ్య, శ్రీను, మిద్దె గూడం శివయ్య తదితరులు పాల్గొన్నారు.