ఎస్ఐ రాత పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఇంచార్జ్ సీపీ సత్యనారాయణ ఐపిఎస్.

Published: Monday August 08, 2022

మంచిర్యాల బ్యూరో, జులై07, ప్రజాపాలన:

 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హిందీ

హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎస్సై రాత పరీక్షా కేంద్రాన్ని రామగుండం కమిషనరేట్ ఇంచార్జ్ సీపీ సత్యనారాయణ ఐపిఎస్ ఆదివారం పరిశీలించారు. పరీక్షల నిర్వాహణ , వసతులు తదితర అంశాల కు సంబంధించిన వివరాలను

స్థానిక పోలిస్ అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ.... ఎస్ఐ రాత పరీక్ష ను రామగుండం పోలిస్ కమిషనరేట్

పరిధిలో పగద్బండిగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని

5727 మంది అభ్యర్థులు ఈ ఎస్సై పరీక్షా వ్రాస్తున్నారని అన్నారు. అధునాతన

టెక్నాలజీ ఉపయోగించి పరీక్షలు నిర్వహిస్తున్నందున పరీక్షల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని దళారుల మాటలు నమ్మిమోసపోవద్దని మరోసారి హెచ్చరించారు.అదేవిధంగా పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, లక్షేట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, పొలిసు అధికారులు పాల్గొన్నారు.