జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎంఎస్ఆర్

Published: Monday September 05, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 4 ప్రజాపాల నప్రతినిధిమండలం లోని మాటూరు హైస్కూల్లో పనిచేస్తున్న మేడేపల్లి శ్రీనివాసరావుని జిల్లా ఉత్తమ ఉపాద్యాయుగా ఎంపిక చేస్తూ  ఆదివారం జిల్లా విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేశారు. మేడిపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ తాను పనిచేసే పాఠశాల మాత్రమే కాకుండా ఇతర పాఠశాలకు సహాయ సహకారాలు అందించేవారు. మేడేపల్లి శ్రీనివాసరావు గణిత శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులకు గణేష్ శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగే విధంగా విద్యాబోధన చేస్తారని పేరు ఉంది. ప్రతిభ కనపరచాలని ఉద్దేశంతో అధిక సమయం కేటాయిస్తూ ప్రతిభా పోటీ పరిక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతే కాకుండా  ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు రక్తదానం చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, సామాజిక సేవకులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. మేడేపల్లి శ్రీనివాసరావు భోధన ఒక్కటే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ ఇస్తూ పోటీ పరిక్షలలో రాణించేలా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ, ప్రతి ఆదివారం మధిర లోని ఉచిత హోమియో హాస్పిటల్ లో వాలంటీర్ గా సేవలు అందిస్తూ పలువురకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మేడిపల్లి శ్రీనివాసరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపికైన సందర్బంగా మధిర మండల విద్యాశాఖాధికారి  వై ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సాయికృష్ణ, మాటూరు గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.