జిల్లా లో ఘనంగా సావిత్రి బాయి ఫూలే 192 వ జయంతి వేడుకలు* - ఉత్తమ మహిళలలను సన్మానించిన జిల్లా జడ్జ

Published: Wednesday January 04, 2023
 మంచిర్యాల టౌన్, జనవరి 03,
 ప్రజాపాలన : 
 
సావిత్రిబాయి పూలే 192వ జయంతిని వేడుకలను జిల్లా కేంద్రంలో  వివిధ కుల సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో  బెల్లంపల్లి చౌరస్తా లో గల ఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన  జయంతి వేడుకల్లో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్
, సెషన్ జడ్జ్ , జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ ఛైర్మన్ బత్తుల సత్తయ్య, జిల్లా సెషన్ మేజిస్ట్రేట్    మైత్రియి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ  విద్యతో మహిళల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు మహిళకు విద్య ప్రాధాన్యతను గుర్తు చేసిన గొప్ప మహిళ  సావిత్రిబాయి ఫూలే  అని అన్నారు. జిల్లా లో అత్యుత్తమ సేవలను అందించిన మహిళను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పెంట రాజన్న  వైస్ చైర్మన్,ముఖేష్ గౌడు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్,  నల్ల శేంకర్, శ్రీదేవి  , అత్తి సరోజ, నగునూరి అర్చన   బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూగల మహేష్ లీగల్ అడ్వైజర్ చిట్ల రమేష్  వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
*బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ...
 
 మంచిర్యాల జిల్లా  బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మహత్మ సావిత్రిబాయి పూలే  192 వ జయంతిని జిల్లా అధ్యక్షులు కాదాసి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన ప్రజల కోసం విద్యనే ఏకైక మార్గంగా ఎంచుకొని తన భర్త ద్వారా చదువు నేర్చుకుని 52 పాఠశాలలు నెలకొల్పి భారతదేశానికి మొదటి ఉపాధ్యాయు రాలుగా నిలవడం మన భారతీయులకు గర్వకారణం అని అన్నారు.
 
 *ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
 
 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఐబి గెస్ట్ హౌస్ లో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు రక్తదానం చేశారు.