పేదలకు న్యాయం చెయ్యకుంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల లోకి వెళతారు

Published: Monday April 25, 2022
సిపిఎం, ఎం సిపిఐ (యు) నాయకుల హెచ్చరిక
బెల్లంపల్లి ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణం లోని షంషేర్ నగర్లో ఇటీవల ఇళ్ల కూల్చివేత కు గురైన వారికి వెంటనే న్యాయం చేయకపోతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కి వెళ్తారని ఎం సిపిఐ యు, సిపిఎం, కెవిపిఎస్ నాయకులు తెలిపారు. ఆదివారం  ఇండ్లు, గుడిసెలు, కోల్పోయిన పేదలు, గత పది రోజులుగా తమకు న్యాయం చేయాలని ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఆదివారం నాడు పోరాటంలో భాగంగా మోకాళ్ళ మీద నిలబడి నిరసన తెలపడం జరిగిందని వారన్నారు. కూలి పని చేసుకునే వారికి ప్రభుత్వమ్, పేదల ఇండ్లను గుడిసెలను కూల్చివేయడం ఇంతవరకు సరైందని వారు ప్రశ్నించారు, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు గత పది రోజులుగా చెట్ల కింద కూర్చుని ఉంటే, ప్రజా ప్రతినిధులకు కనీస స్పందన లేకుండా పోయిందని, ఓటు వేసిన పాపానికి పేదలు ఇండ్లు, గుడిసెలు, కోల్పోవాల్సి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పోరాటం ఉధృతం చేయడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, అరేపల్లి రమేష్, గొడిసేల చంద్ర మొగిలి, మొర్లలక్ష్మి, శృతి, రవి, సైనా, పర్వీన్, లక్ష్మి నారాయణ, రవి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.