వయో పరిమితి లేకుండా జర్నలిస్టులకు వ్యాక్సిన్

Published: Saturday May 29, 2021

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్
ఆసిఫాబాద్ జిల్లా, మే27 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా నివారణలో భాగంగా అందిస్తున్న వ్యాక్సిన్ ను వయసుతో సంబంధం లేకుండా జిల్లాలోని జర్నలిస్టులకు నేటి నుండి ఈ నెల 30 వరకు వ్యాక్సిన్ ను వేయనున్నట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలోని 6 కేంద్రాలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్, వాంకిడి, మండల జర్నలిస్టులకు, అదేవిధంగా జైనూర్ మండల కేంద్రంలో జైనూర్,  లింగాపూర్, సిర్పూర్,(యు) కెరమెరి, రెబ్బెన మండల కేంద్రంలో తిర్యాని, సిర్పూర్ టి మండల కేంద్రంలో సిర్పూర్ టి చింతల మానేపల్లి కౌటాల, పెంచికల్పేట్ మండల కేంద్రంలో దహేగాం, బెజ్జూర్, కాగజ్ నగర్ మండల కేంద్రంలో కాగజ్నగర్ జర్నలిస్టులకు వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టేలా జిల్లా వైద్యాధికారులు నిర్ణయించినట్టు తెలిపారు. వ్యాక్సిన్ ను ప్రతి ఒక్క జర్నలిస్టు వయస్సుతో సంబంధం లేకుండా తీసుకోవాలని, అవకాశాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.