యువత నేతాజీ ని స్ఫూర్తిగా తీసుకోవాలి

Published: Monday January 24, 2022
చిన్నారులతో మొక్క నాటిన - సమ్మయ్య
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 23) : సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్బంగా 3 సంవత్సరాల ఇటికాల నవ నిత తో అడవి తంగేడు పూల మొక్క వరంగల్ జిల్లా. మండలం. నెక్కొండ గుండ్ర పల్లి గ్రామంలో వన ప్రేమికుడు సమ్మయ్య మొక్కలు నాటడం జరిగింది. సమ్మయ్య మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా సుభాష్ చంద్రబోస్ ఆలోచనా విధానాలు ప్రతి ఒక్క విద్యార్థులకు చిన్నారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మహనీయులను గుర్తు చేసుకొని కాసర్ల గగన శ్రీ, బిర్రు నిత్య శ్రీ, బిర్రు దివ్య శ్రీ తో ఆదివారం రోజు మొక్కలు చిన్నారులతో నాటడం జరిగిందని అన్నారు .భారత స్వాతంత్ర్య సమర వీరులలో అగ్రగణ్యుడు, పుట్టుకే గాని మరణం లేని మహావీరుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో, తన అసమాన త్యాగాలతో ఆయన భావితరాలకు ఎల్లప్పటికీ ప్రేరణగా నిలుస్తారు అని మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య పోరాటంలో 11 సార్లు జైలుకు వెళ్లిన పట్టు వదలని మాహా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని నేటితరం యువత సుభాష్ చంద్రబోస్ ఆలోచన విధానంగా నడవాలని వన ప్రేమికుడు సమ్మయ్య ఈ సందర్భంగా తెలిపారు